Jharkhand: బాయ్‌ఫ్రెండ్ కోసం నడిరోడ్డుపై అమ్మాయిల సిగపట్లు.. వీడియో వైరల్

Two girls fight over boyfriend on street in  jharkhand

  • ఝార్ఖండ్‌లోని జరాయ్‌కేలాలో ఘటన
  • నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే పిడిగుద్దులు
  • పోలీసులొచ్చే సరికి పరార్

బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతులు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. తన బాయ్‌ఫ్రెండ్ మరో యువతితో తిరుగుతుండడాన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన మరో యువతి తట్టుకోలేకపోయింది. ఆమె జుట్టు పట్టుకుని పిడిగుద్దులు కురిపించింది. ఆమె కూడా ఎదురుతిరిగింది. దీంతో సీన్ రసవత్తరంగా మారింది. ఇద్దరూ నడిరోడ్డుపై ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. కిందపడి మరీ ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు.

నడిరోడ్డుపై అందరూ చూస్తున్నా వారు ఆగలేదు సరికదా, మరింతగా చెలరేగిపోయారు. దీంతో ఓ యువకుడు, ఓ యువతి వారిని అతి బలవంతంగా విడిపించారు. విషయం తెలిసి  పోలీసులు అక్కడకు చేరుకునేలోపే యువతులిద్దరూ పరారయ్యారు. ఝార్ఖండ్‌లోని జరాయ్‌కేలాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరూ ఒక లుక్కేయండి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News