India: టోక్యో పారా ఒలింపిక్స్ కు భారత బృందం పయనం
- ఇటీవల ముగిసిన టోక్యో వేసవి ఒలింపిక్ క్రీడలు
- అదే వేదికపై దివ్యాంగులకు ఒలింపిక్స్
- ఈ నెల 24 నుంచి సెప్టెంబరు 5 వరకు పోటీలు
- భారత్ బృందంలో 54 మంది క్రీడాకారులు
- 9 క్రీడాంశాల్లో పోటీపడనున్న భారత్
టోక్యోలో ఇటీవలే వేసవి ఒలింపిక్ క్రీడలు ముగిశాయి. ఇక అదే వేదికపై దివ్యాంగుల కోసం పారాలింపిక్స్ జరగనున్నాయి. పోటీపడేది దివ్యాంగులే అయినా, స్పూర్తిదాయక ప్రదర్శనలో వారు ఎవరికీ తీసిపోరు. టోక్యో పారా ఒలింపిక్స్ ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 5వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ క్రీడల్లో పాల్గొనే భారత బృందం ఈ సాయంత్రం టోక్యో పయనమైంది. భారత బృందంలో 54 మంది అథ్లెట్లు ఉన్నారు. ఢిల్లీలో భారత క్రీడాకారులకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వీడ్కోలు పలికారు.
పారా ఒలింపిక్ క్రీడల్లో భారత ఆటగాళ్లు 9 క్రీడాంశాల్లో పోటీపడనున్నారు. ఓపెనింగ్ సెర్మనీలో భారత క్రీడాకారుడు మరియప్పన్ త్రివర్ణ పతాకాన్ని చేతబూని మార్చ్ పాస్ట్ చేయనున్నాడు. కాగా, టోక్యో పారా ఒలింపిక్స్ లో భారత్ పాల్గొనే క్రీడాంశాలు ఈ నెల 27 నుంచి షురూ కానున్నాయి. తొలుత భారత క్రీడాకారులు ఆర్చరీలో పోటీ పడతారు.
కాగా, టోక్యో పారా ఒలింపిక్ క్రీడలను భారత్ లో యూరోస్పోర్ట్ ఇండియా, డీడీ స్పోర్ట్స్ చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.