Dead Body: అంత్యక్రియలకు డబ్బు లేక తాత మృతదేహాన్ని ఫ్రిజ్ లో దాచిన మనవడు!

Youth preserve his grandpa dead body in fridge

  • వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఘటన
  • మనవడు నిఖిల్ తో కలిసి జీవిస్తున్న బాలయ్య
  • బాలయ్య రిటైర్డ్ ఉద్యోగి
  • కొన్నిరోజుల కిందట మృతి

వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో దిగ్భ్రాంతిగొలిపే సంఘటన వెల్లడైంది. ఓ యువకుడు తాత మృతదేహాన్ని ఫ్రిజ్ లో దాచిన వైనం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ప్రశ్నించగా అంత్యక్రియలకు డబ్బుల్లేక ఆ విధంగా చేశానని ఆ మనవడు వెల్లడించారు. కామారెడ్డికి చెందిన బాలయ్య ఓ రిటైర్డ్ ఉద్యోగి. ఆయన వయసు 93 ఏళ్లు. తన మనవడు నిఖిల్ తో కలిసి పరకాల సగర వీధిలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.

అయితే ఇటీవల బాలయ్య మరణించారు. ఏంచేయాలో తెలియక ఆ వృద్ధుడి మృతదేహాన్ని నిఖిల్ తమ ఫ్రిజ్ లో దాచాడు. అయితే వారి ఇంటినుంచి భరించలేని దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు తెలిపారు. పోలీసులు వచ్చి నిఖిల్ ను ప్రశ్నించగా, అసలు విషయం వెలుగుచూసింది. దీనిపై పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Dead Body
Fridge
Parakala
Warangal Rural District
  • Loading...

More Telugu News