Prakash Raj: సర్జరీ సక్సెస్ అయింది: ప్రకాశ్ రాజ్

Surgery is successful says Prakash Raj

  • షూటింగ్ సందర్భంగా గాయపడ్డ ప్రకాశ్ రాజ్
  • హైదరాబాదులో సర్జరీ చేయించుకున్న వైనం
  • త్వరలోనే యాక్షన్ లోకి వస్తానని ట్వీట్

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఓ తమిళ షూటింగ్ సందర్భంగా ఫ్లోర్ పై ఆయన జారిపడ్డారు. దీంతో ఆయన గాయపడ్డారు. తనకు చిన్న ఫ్రాక్చర్ అయిందని, హైదరాబాదులోని డాక్టర్ గురువారెడ్డితో సర్జరీ చేయించుకునేందుకు వస్తున్నానని ఆయన నిన్న ట్వీట్ చేశారు.

తాజాగా ఆసుపత్రి నుంచి ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. సర్జరీ విజయవంతమయిందని ఆయన చెప్పారు. తనకు సర్జరీ చేసిన డాక్టర్ గురువారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తాను కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. త్వరలోనే మళ్లీ యాక్షన్ లోకి వస్తానని చెప్పారు. 'ది డెవిల్ ఈజ్ బ్యాక్' అని ట్వీట్ చేశారు. ఆసుపత్రి బెడ్ మీద నవ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్ చేశారు.

Prakash Raj
Surgery
Tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News