Adinarayana Reddy: ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి సమర్థించుకుంటున్నారు: బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి విమర్శలు

Jagan will go to jail says Adinarayana Reddy

  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది
  • సొంత పేపర్లో గొప్పగా రాసుకుంటున్నారు
  • ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేస్తున్నారు  

ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి సమర్థించుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి లేకపోయినా వారి సొంత పేపర్లో గొప్పగా రాసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తెస్తున్న పత్రికలపై దాడికి తెగబడుతున్నారని మండిపడ్డారు. చివరకు న్యాయస్థానాలను కూడా గౌరవించడం లేదని అన్నారు. ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేస్తూ, తప్పుడు కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. అక్రమాస్తుల కేసులో త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.

Adinarayana Reddy
BJP
Jagan
YSRCP
Jail
Disproportionate Assets Case
  • Loading...

More Telugu News