Polavaram Project: పోలవరం ముంపుపై ఏం చర్యలు తీసుకున్నారు?: నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్
- ఒక్క అధికారిపై కూడా ఇంత వరకు చర్యలు తీసుకోలేదు
- పర్యావరణ చట్టాన్ని ఏపీలో తీవ్రంగా ఉల్లంఘిస్తున్నారు
- కేసును ముగించాలనే ఆత్రుత సీపీసీబీలో కనిపించింది
ఏపీకి చెందిన పోలవరం, పట్టిసీమ, పురుషోత్తమపట్నం ప్రాజెక్టులపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) లో ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణాలను చేపట్టినప్పటికీ.. ఏ ఒక్క అధికారిపై కూడా ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. పర్యావరణ చట్టాన్ని ఏపీలో తీవ్రంగా ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
పోలవరం కాఫర్ డ్యామ్ వల్ల ఎగువ ప్రాంతాలు మూడేళ్ల నుంచి ముంపుకు గురవుతుంటే... ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. సీపీసీబీ నివేదికలో కేసును త్వరగా ముగించాలనే ఆత్రుత కనిపించిందే తప్ప... చట్టబద్ధంగా నివేదిక ఇవ్వాలన్న చిత్తశుద్ధి కనిపించలేదని వ్యాఖ్యానించింది.