YS Sunitha Reddy: పులివెందులలో సీబీఐ అధికారులను కలిసిన వివేకా కుమార్తె, అల్లుడు

YS Sunitha Reddy and her husband met CBI officials

  • వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు
  • పులివెందులలో ఆయుధాల కోసం గాలింపు
  • ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు వచ్చిన సునీత దంపతులు
  • వివేకా హత్యకేసుపై అధికారులతో మాట్లాడిన వైనం

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం వివేకా హత్యలో వాడిన ఆయుధాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వివేకా కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇవాళ పులివెందులలో సీబీఐ అధికారులను కలిశారు. ఆర్ అండ్ గెస్ట్ హౌస్ కు వెళ్లిన సునీతా రెడ్డి దంపతులు సీబీఐ అధికారులతో మాట్లాడారు. కేసుకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

కాగా, వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఇవాళ పలువురిని మరోసారి విచారించారు. ఉదయ్ కుమార్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి, ఇనయతుల్లా, రంగన్న, వంటమనిషి లక్ష్మమ్మ కుమారుడు ప్రకాశ్ లను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

YS Sunitha Reddy
Rajasekhar Reddy
CBI
YS Vivekananda Reddy
Murder
Pulivendula
  • Loading...

More Telugu News