Komatireddy Venkat Reddy: ఈ సమస్యలు పరిష్కరిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను... కావాలంటే బాండ్ రాసిస్తా: కోమటిరెడ్డి

Komatireddy comments on pending works and bills

  • చౌటుప్పల్ లో ఎంపీ వ్యాఖ్యలు
  • పెండింగ్ పనులు పరిష్కరించాలన్న కోమటిరెడ్డి
  • పరిష్కరిస్తే పదవికి రాజీనామా చేస్తానని వెల్లడి
  • రూ.1350 కోట్ల బకాయిలు ఉన్నాయని వివరణ

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల పరిషత్ సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, పెండింగ్ సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేస్తే ఎంపీ పదవికి ఇప్పుడే రాజీనామా చేస్తానని ప్రకటించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయనని, కావాలంటే బాండ్ పేపర్ పై రాసిస్తానని స్పష్టం చేశారు.

తన నియోజకవర్గంలో పనులకు సంబంధించి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ.1,350 కోట్ల బకాయిలు పెట్టిందని కోమటిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిల్లులు రాక కొందరు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉందని వివరించారు.

Komatireddy Venkat Reddy
Pending Works
Bills
Contractors
Bhuvanagiri
Congress
Telangana
  • Loading...

More Telugu News