RRR: ఉక్రెయిన్​ లో చివరి షెడ్యూల్​: షూటింగ్​ ఫొటోను షేర్​ చేసిన ఆర్​ఆర్​ఆర్​ హీరోయిన్​

Olivia Morrison Shares Photo Of RRR Shooting

  • ఉక్రెయిన్ లో చివరి షెడ్యూల్ షూటింగ్
  • పాట చిత్రీకరణలో పాల్గొన్న తారక్ హీరోయిన్
  • వెనక్కు తిరిగి చూస్తున్న ఫొటో పోస్ట్

కొమురం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ తేజ్, డైరెక్టర్ గా రాజమౌళి.. ఈ ముగ్గురి కాంబోలో వస్తున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. సినిమాను ప్రకటించినప్పటి నుంచి దానిపై ఎన్ని అంచనాలున్నాయో తెలిసిందే. సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.


తాజాగా ఉక్రెయిన్ లో జరుగుతున్న చివరి షెడ్యూల్ లో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఆ షూటింగ్ లో ఒలీవియా పాల్గొంది. తారక్, ఒలీవియాల మధ్య ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. దానికి సంబంధించిన ఓ ఫొటోను ఒలీవియా తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది. వెళ్తూ వెళ్తూ వెనక్కు తిరిగి చూస్తున్న ఫొటోను పెట్టింది. షూటింగ్ లో మళ్లీ జాయిన్ అయినందుకు ఆనందంగా ఉందని కామెంట్ పెట్టింది.

RRR
Junior NTR
Jr NTR
Ramcharan
Rajamouli
Olivia Morris
  • Loading...

More Telugu News