Taneti Vanita: ఏపీ మంత్రి తానేటి వనిత ఇంట విషాదం
- వనిత తల్లి సుశీల(76) కన్నుమూత
- అనారోగ్య కారణాలతో రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
- పలువురి పరామర్శ
ఏపీ మంత్రి తానేటి వనిత ఇంట విషాదం నెలకొంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వనిత తల్లి జొన్నకూటి సుశీల (76) కన్నుమూశారు. రాజమండ్రిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తానేటి వనిత ఆంధ్రప్రదేశ్ మహిళా స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఆమెకు మాతృవియోగం కలిగిన విషయం తెలుసుకున్న పలువురు నేతలు ఆమెను పరామర్శించారు.