Telangana: తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

Moderate rains in telangana today and tomorrow
  • నిన్న తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు
  • ములుగు జిల్లా కాశిందేవిపేటలో అత్యధికంగా 3.8 సెంటీమీటర్ల వర్షపాతం
  • తెలంగాణపై బలహీనంగా కదులుతున్న రుతుపవనాలు
తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. నిన్న రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ములుగు జిల్లా కాశిందేవిపేటలో నిన్న అత్యధికంగా 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, తెలంగాణపై రుతుపవనాల కదలికలు బలహీనంగా  ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే, ఉత్తర భారతదేశం వైపు నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్టు పేర్కొన్నారు.
Telangana
Rains
Monsoon

More Telugu News