CM KCR: కొత్త సెక్రటేరియట్ ను పూర్తిగా పరిశీలించిన సీఎం కేసీఆర్
- తెలంగాణలో నూతన సచివాలయ నిర్మాణం
- నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్
- అక్కడే రెండున్నర గంటలు గడిపిన వైనం
- సీఎం వెంట మంత్రులు, సీఎస్
తెలంగాణలో పాత సచివాలయాన్ని తొలగించి కొత్త సచివాలయాన్ని నిర్మిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇవాళ కొత్త సెక్రటేరియట్ ను పూర్తిగా పరిశీలించారు. నిర్మాణ ప్రాంతాలతో పాటు మెయిన్ గేటు ఏర్పాటును కూడా పరిశీలించారు. సీఎం దాదాపు రెండున్నర గంటల పాటు నూతన సచివాలయ భవన నిర్మాణాల వద్దే గడిపారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ గౌడ్, రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు ఉన్నారు.
వందేళ్ల పసిడి కలలను నీరజ్ చోప్రా నిజం చేశాడు: సీఎం కేసీఆర్
టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఈవెంట్ లో నీరజ్ చోప్రా భారత్ కు పసిడి పతకం అందించడంపై సీఎం కేసీఆర్ స్పందించారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు ఇదే తొలి స్వర్ణం అని, అథ్లెటిక్స్ లో పసిడి పతకం కోసం భారత్ వందేళ్లుగా ఎదురుచూస్తోందని, ఇప్పుడందరి కలలను నీరజ్ చోప్రా నిజం చేశాడని సీఎం కేసీఆర్ కొనియాడారు. నీరజ్ చోప్రా విజయం దేశంలోని క్రీడాకారులందరికీ స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరుస్తుండడం సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు. ఇది భారతీయులందరూ గర్వించే విజయం అని కీర్తించారు.