Raj Kundra: రాజ్ కుంద్రా బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చిన బాంబే హైకోర్టు

Bombay high court refuse to release Raj Kundra

  • ఇటీవల పోర్న్ చిత్రాల కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్
  • కోర్టు రిమాండ్ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించిన కుంద్రా
  • తనను విడుదల చేయాలని విజ్ఞప్తి
  • తాము జోక్యం చేసుకోలేమన్న బాంబే హైకోర్టు

పోర్న్ చిత్రాల కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రాకు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, తక్షణమే విడుదల చేయాలని కోరుతూ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా తన పిటిషన్ లో పేర్కొన్నారు. తన అరెస్ట్ కు ముందు నోటీసులు ఇవ్వలేదని, పైగా మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ ఆదేశాలు ఇచ్చిందని వివరించారు.

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు... మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల్లో ఎలాంటి తప్పులేదని స్పష్టం చేసింది. రాజ్ కుంద్రాకు విధించిన రిమాండ్, జ్యుడిషియల్ కస్టడీ చట్టానికి లోబడే ఉన్నాయని, ఇందులో తాము జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులేమీ లేవని జస్టిస్ ఏఎస్ గడ్కరీ ధర్మాసనం స్పష్టం చేసింది.

Raj Kundra
Petition
Bombya High Court
  • Loading...

More Telugu News