Megha Akash: 'డియర్ మేఘ' నుంచి లిరికల్ వీడియో సాంగ్!

Dear Megha movie lyrical song release

  • మరో ప్రేమకథగా 'డియర్ మేఘ'
  • నాయిక వైపు నుంచి బరువైన పాట 
  • హరిణి ఆలాపన ప్రత్యేక ఆకర్షణ 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు    

మేఘ ఆకాశ్ ప్రధాన పాత్రధారిగా 'డియర్ మేఘ' రూపొందింది. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, అర్జున్ దాస్యం నిర్మాతగా వ్యవహరించాడు. మేఘ ఆకాశ్ జోడీగా అరుణ్ ఆదిత్ .. అర్జున్ సోమయాజుల నటించారు. ఈ ప్రేమకథా చిత్రం నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

' గుండెల్లో కన్నీటి మేఘం .. కమ్మిందా తానైతే దూరం' అంటూ ఈ పాట సాగుతోంది. చెలికాడు దూరమైనా సమయంలో .. సందర్భంలో నాయికగా మనోవేదనగా ఈ పాట తెరపై ఆవిష్కృతమవుతుందని అర్థమవుతోంది. హరి గౌర సంగీతం .. కృష్ణకాంత్ సాహిత్యానికి హరిణి గానం ప్రాణం పోసిందనే చెప్పాలి.
 
మేఘ ఆకాశ్ చాలా చిన్న వయసులోనే  చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. అయితే తెలుగులో తొలి రెండు సినిమాలు పరాజయంపాలు కావడంతో, అవకాశాలు ముఖం చాటేశాయి.  అలాంటి మేఘ ఆకాశ్ కి తన పేరే టైటిల్ గా కలిసిన సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. ఆమె ఆశిస్తున్న సక్సెస్ ఈ సినిమాతో పడుతుందేమో చూడాలి. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News