Aadi Sai Kumar: 'బ్లాక్' సినిమా నుంచి ఆసక్తికరమైన టీజర్!

Intresting teaser from Black movie

  • ఆది చేతిలో మూడు సినిమాలు 
  • థ్రిల్లర్ నేపథ్యంలో సాగే 'బ్లాక్'
  • దర్శకుడిగా జీబీ కృష్ణ పరిచయం 
  • కొత్త కథానాయికగా దర్శన

చూస్తుంటే ఈ మధ్య ఆది సాయికుమార్ తన దూకుడు పెంచినట్టుగానే కనిపిస్తోంది. 'అమరన్' .. 'కిరాతక' .. 'బ్లాక్' సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఒకదానితో ఒకటి ఎంతమాత్రం సంబంధం లేని కథలను ఆయన చేస్తూ వెళుతున్నాడు. ఈ మూడు సినిమాల్లో ఒకటైన 'బ్లాక్' సినిమా నుంచి తాజాగా టీజర్ ను వదిలారు.

యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. విలన్ ఆటకట్టించడానికి హీరో చేసే ప్రయత్నం .. హీరో అంతుచూసే వ్యూహాలతో విలన్ మధ్య జరిగే వార్ తో ఈ కథ నడవనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆది సాయికుమార్ డేరింగ్ పోలీస్ ఆఫీసర్ గా, గతంలో కంటే మరింత ఫిట్ నెస్ తో కనిపిస్తున్నాడు.

మహంకాళి  మూవీస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకు, జీబీ కృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాతో కథానాయికగా 'దర్శన' పరిచయమవుతోంది. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని అందించిన ఈ  సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News