Raghu Rama Krishna Raju: ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షాను కలిసిన రఘురామకృష్ణరాజు

MP Raghurama Krishna Raju met union home minister Amit Shah

  • ట్వీట్ చేసిన రఘురామ
  • అమిత్ షాతో భేటీ సంతోషదాయకం అని వ్యాఖ్యలు
  • ఏపీకి చెందిన అంశాలను చర్చించినట్టు వెల్లడి
  • అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపిన రఘురామ 

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారు. తన భేటీకి సంబంధించిన వివరాలను రఘురామ ట్వీట్ చేశారు. ఇవాళ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావడం సంతోషదాయకం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వివిధ అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానని రఘురామ వివరించారు. తాను ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కలిసేందుకు అవకాశమిచ్చిన అమిత్ షాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News