Chandrababu: వైఎస్ హయాం నాటి నాసిరకం పనుల వల్లే గేటు కొట్టుకుపోయింది: చంద్రబాబు

Chandrababu comments on Pulichintala project issue

  • పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ
  • నిధులు దారిమళ్లిస్తున్నారని ఆరోపణ
  • జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని వ్యాఖ్యలు
  • రేషన్ కార్డుల కోతపై ఆగ్రహం

పులిచింతల ప్రాజెక్టులో క్రస్ట్ గేటు కొట్టుకుపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. నాడు వైఎస్ హయాంలో జరిగిన నాసిరకం పనుల వల్లే గేటు కొట్టుకుపోయిందని ఆరోపించారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని, కుంభకోణాలు చేసే స్కీమ్ లకు ఆ నిధులు మళ్లిస్తున్నారని వెల్లడించారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని అన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని విమర్శించారు.

నిబంధనల పేరుతో భారీగా రేషన్ కార్డులు, పింఛన్లలో కోత విధిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఆస్తులు ఆర్ అండ్ బి విభాగానికి అప్పగించడాన్ని ఖండిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.

Chandrababu
Pulichintala Project
Crest Gate
YSR
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News