MS Dhoni: ధోనీ ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్ తొలగింపు... అభిమానుల ఆగ్రహం

Blue tick was removed and re established from Dhoni social media account

  • ట్విట్టర్ లో కొంతకాలంగా పోస్టులు పెట్టని ధోనీ
  • జనవరిలో చివరి పోస్టు
  • వెరిఫైడ్ మార్కు తీసేసిన ట్విట్టర్
  • కాసేపటి తర్వాత బ్లూ టిక్ పునరుద్ధరణ

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ట్విట్టర్ లో ఖాతా ఉన్నా, ఆయన అందులో చేసే పోస్టులు చాలా తక్కువ. ధోనీ ఈ ఏడాది జనవరి తర్వాత ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ధోనీ ఖాతాకున్న బ్లూ టిక్ వెరిఫైడ్ మార్కును ట్విట్టర్ తొలగించింది.

దీనిపై ట్విట్టర్ నుంచి వివరణ రానప్పటికీ, ట్విట్టర్ లో ధోనీ క్రియాశీలకంగా లేనందువల్లే బ్లూ టిక్ తొలగించినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ధోనీ అభిమానులు ట్విట్టర్ పై మండిపడుతున్నారు. ధోనీ అకౌంట్ కు బ్లూ టిక్ మార్కును కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అయితే కాసేపటికే ట్విట్టర్ పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. ధోనీ ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్ ను మళ్లీ జోడించింది. ధోనీకి ట్విట్టర్ లో 8.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండడం విశేషం. ధోనీ తన అకౌంట్ ద్వారా కేవలం 33 మందిని అనుసరిస్తున్నారు.

  • Loading...

More Telugu News