Nirmala Sitharaman: విశాఖలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు స్వాగతం పలికిన రాష్ట్ర వర్గాలు

Union Minister Nirmala Sitharaman arrives Vizag

  • విశాఖ పర్యటనకు వచ్చిన నిర్మలా సీతారామన్
  • స్వాగతం పలికిన మంత్రులు, బీజేపీ నేతలు
  • విమానాశ్రయం నుంచి విశాఖ పోర్టు గెస్ట్ హౌస్ కు పయనం 
  • నిర్మల రాక నేపథ్యంలో హై అలర్ట్

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఏపీ మంత్రులు, బీజేపీ నేతలు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమె విమానాశ్రయం నుంచి విశాఖ పోర్టు గెస్ట్ హౌస్ కు వెళ్లారు.

కాగా, నిర్మలా సీతారామన్ విశాఖ పర్యటన సందర్భంగా ఎయిర్ పోర్టు వద్ద హై అలర్ట్ విధించారు. ఉక్కు పరిశ్రమ కోసం పోరాడుతున్న కార్మిక సంఘాల నేతలు కేంద్రమంత్రికి వినతిపత్రాలు సమర్పించాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానాశ్రయం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతించారు.

Nirmala Sitharaman
Vizag
Airport
High Alert
Vizag Steel Plant
Andhra Pradesh
  • Loading...

More Telugu News