Priyadarshini: ఆత్మరక్షణ కోసమే క్యాబ్ డ్రైవర్‌పై చేయి చేసుకున్నా.. చెంపదెబ్బ కేసులో యువతి ట్విస్ట్

Should a girl not defend herself asks Lucknow woman

  • సీసీ టీవీలో యువతిదే తప్పని స్పష్టంగా కనిపిస్తున్న వైనం 
  • ఆత్మరక్షణ కోసమే కొట్టానన్న యువతి
  • పోలీసులు తనను వేధిస్తున్నారన్న యువతి

నడిరోడ్డుపై ఓ ట్యాక్సీ డ్రైవర్ చెంపలు ఎడాపెడా వాయించిన లక్నో యువతి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ట్యాక్సీ డ్రైవర్‌ సాదత్ సిద్ధిఖీని ప్రియదర్శిని అనే యువతి చెంపలు వాయిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

తాను రోడ్డు దాటుతున్న సమయంలో కారుతో అతడు అతి సమీపంగా వచ్చాడని, దాదాపు ఢీకొట్టేంత పని చేశాడని ఆరోపిస్తూ అతడిని క్యాబ్ నుంచి కిందికి లాగి ఎడాపెడా చెంపలు వాయించింది. ఇది చూసిన ఓ వ్యక్తి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే అతడిపైనా చేయి చేసుకుంది. దీంతో పోలీసులు సిద్ధిఖీపై ట్రాఫిక్ ఉల్లంఘన కేసు పెట్టారు.

తాను ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించలేదని, అయినప్పటికీ పోలీసులు తనపై కేసు పెట్టారని సిద్ధిఖీ వాపోయాడు. పోలీసులు ఒక రోజంతా తనకు ఆహారం కూడా పెట్టలేదని, ఆ యువతి చెప్పిందే విన్నారు తప్పితే పేదవాడినైన తన మాటలు ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమె తన ఫోన్‌ను పగలగొట్టిందని, కారు సైడ్ అద్దాలను బద్దలగొట్టడమే కాకుండా, తన జేబులో ఉన్న రూ. 600 కూడా లాక్కుందని ఆరోపించాడు.
 
దీంతో పోలీసులు సీసీటీవీ కెమెరాలు పరిశీలించగా అసలు నిజం బయటపడింది. యువతిదే తప్పని తేలింది. ఆమె ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీంతో యువతిని అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. ఒత్తిడి పెరగడంతో పోలీసులు తప్పని పరిస్థితిలో యువతిపై కేసు నమోదు చేశారు.

అయితే, తనపై కేసు నమోదు కావడంపై స్పందించిన యువతి పోలీసులు తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని, వారి వద్ద తన నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నాయని పేర్కొంది. తనపై మోపిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్న యువతి ఆత్మరక్షణ కోసమే క్యాబ్ డ్రైవర్‌పై చేయి చేసుకున్నానని చెప్పడం కొసమెరుపు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News