Pulichinthala: పులిచింత‌ల డ్యామ్ నుంచి నీళ్లు వ‌దులుతుండ‌గా ఊడిపోయిన గేటు.. కొన్ని ప్రాంతాల్లో వ‌ర‌ద‌లు వ‌చ్చే అవ‌కాశం.. వీడియో ఇదిగో

A gate of Pulichinthala dam in Krishna district was washed away

  • సాంకేతిక కార‌ణాల వ‌ల్ల‌ 16వ నంబర్‌ గేటు ఊడిపోయిన వైనం
  • ప్రకాశం బ్యారేజీకి వృథాగా నీరు
  • దిగువ‌కు 1,65,763 క్యూసెక్కుల నీరు
  • స్టాప్‌లాక్ గేట్‌తో ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొస్తామ‌న్న క‌లెక్ట‌ర్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లా పులిచింత‌ల డ్యామ్ నుంచి నీళ్లు వ‌దులుతుండ‌గా సాంకేతిక కార‌ణాల వ‌ల్ల‌ 16వ నంబర్‌ గేటు ఒక్క‌సారిగా ఊడిపోయింది. దీంతో ప్రకాశం బ్యారేజీకి నీరు వృథాగా పోతోంది. 1,65,763 క్యూసెక్కుల మేర నీరు దిగువకు వెళ్తున్నట్లు అధికారులు చెప్పారు.  

పులిచింతల ప్రాజెక్టులో గరిష్ఠస్థాయిలో నీరు నిల్వ ఉండ‌డంతో కొత్త గేటు అమర్చే ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో అధికారులు ప్రత్యామ్నాయంగా స్టాప్‌లాక్‌ పరిజ్ఞానంతో నీరు వెళ్లకుండా చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌ర‌పాల‌ని భావిస్తున్నారు. ఏపీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌ హుటాహుటీన పులిచింతల ప్రాజెక్టు వద్దకు వచ్చి ప‌రిస్థితిని పరిశీలించారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో ఆయన చర్చలు జ‌రుపుతున్నారు. దీనిపై స్పందించిన కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ జె.నివాస్... స్టాప్‌లాక్ గేట్‌తో ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొస్తామ‌ని చెప్పారు. పులిచింత‌ల డ్యామ్ గేటు ఊడిపోవ‌డంతో కొన్ని ప్రాంతాల్లో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News