Mehreen: మళ్లీ బిజీ అవుతున్న మెహ్రీన్!

Mehreen Upcoming movies

  • గ్లామరస్ హీరోయిన్ గా క్రేజ్
  • అందానికి తోడవుతూ వచ్చిన అదృష్టం
  • పెళ్లి కారణంగా తగ్గించిన సినిమాలు
  • లైన్లోకి మళ్లీ కొత్త ప్రాజెక్టులు  

తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందాల కథానాయికలలో మెహ్రీన్ ఒకరు. 'కృష్ణగాడి వీరప్రేమగాథ' సినిమాతో ఈ అమ్మాయి తెలుగు తెరకి పరిచయమైంది. సాధారణంగా తొలి సినిమాతోనే హిట్ పడటమనేది చాలా తక్కువమంది విషయంలోనే జరుగుతూ ఉంటుంది. కానీ మెహ్రీన్ వరుసగా మూడు భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

'మహానుభావుడు' .. రాజా ది గ్రేట్' సినిమాలు గ్లామర్ పరంగా .. నటన పరంగా కూడా మెహ్రీన్ కి మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆ తరువాత 'ఎఫ్ 2' సినిమా కూడా ఆమె కెరియర్ లోనే భారీ సక్సెస్ ను నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె సినిమాలు తగ్గిస్తూ వచ్చింది. దాంతో ఈ విషయం తెలియనివారు ఆమెకి ఆఫర్లు రావడం లేదని అనుకున్నారు.

కొన్ని కారణాల వలన మెహ్రీన్ పెళ్లి ఆలోచనను వాయిదా వేసుకుంది. ఇప్పుడు పూర్తిగా తన దృష్టిని కెరియర్ పై పెట్టింది. సాధ్యమైనంత త్వరగా మళ్లీ దార్లో పడిపోవాలనే ఉద్దేశంతో, ఓ మాదిరి బడ్జెట్ తో రూపొందే మూడు సినిమాలకు సైన్ చేసిందట. త్వరలోనే ఈ సినిమాలు పట్టాలెక్కనున్నాయని అంటున్నారు. ఆ సినిమాల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Mehreen
Mahanubhavudu
Raja The Great
  • Loading...

More Telugu News