Naga Shourya: 'వరుడు కావలెను' నుంచి 'దిగు దిగు దిగు నాగ' లిరికల్ సాంగ్!

 Lyrical song from Varudu Kavalenu

  • నాగశౌర్య నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్
  • ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్
  • తమన్ నుంచి మరో జానపద బాణీ
  • త్వరలోనే సినిమా విడుదల

నాగశౌర్య కథానాయకుడిగా 'వరుడు కావలెను' సినిమా రూపొందుతోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు, లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్ లకు .. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. లుక్ పరంగా నాగశౌర్య .. రీతూ వర్మ ఇద్దరూ కూడా మంచి మార్కులు కొట్టేశారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను వదిలారు. 'దిగు దిగు దిగు నాగ' అంటూ ఈ పాట సాగుతోంది. తెలంగాణలో 'దిగు దిగు దిగు నాగ' అనేది చాలా పాప్యులర్ అయిన జానపద గీతం. ఈ పాటను ఆ లైన్ తో మొదలుపెట్టి, అదే బాణీలో సినిమా సాహిత్యాన్ని అల్లారు. తమన్ స్వరపరిచిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, శ్రేయ ఘోషల్ ఆలపించారు.

మనసైన వాడి కోసం ఎదురుచూస్తూ ఓ కుర్రమనసు కోరికతో పాడే కొంటె పాట ఇది. బీట్ చాలా హుషారుగా .. ఉత్సాహంగా సాగింది. 'కొంపాకొచ్చిపోరో కోడెనాగ .. కొంపా ముంచుతాందోయ్ ఈడు బాగా' వంటి పదప్రయోగాలు బాగున్నాయి. ఫొటోగ్రఫీ .. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఆకట్టుకునేలా ఉన్నాయి. మాస్ ఆడియన్స్ నుంచి ఈ పాటకు మంచి మార్కులు దక్కుతాయనడంలో సందేహం లేదు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News