Telangana: ఈరోజు నుంచే తెలంగాణ ఎంసెట్.. విద్యార్థులు వీటిని కచ్చితంగా పాటించాలి!

Telangana EAMCET starts from today

  • రెండు గంటల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి
  • ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
  • ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి

తెలంగాణలో ఈరోజు నుంచి ఎంసెట్ పరీక్షలు మొదలవుతున్నాయి. ఈ సందర్భంగా ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ మాట్లాడుతూ, ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రెండు గంటల ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సెల్ఫ్ డిక్లరేషన్ సైతం ఇవ్వాలని తెలిపారు. కరోనా బారిన పడిన విద్యార్థులకు సెషన్స్ అన్నీ పూర్తయిన తర్వాత మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు.

కంప్యూటర్ బేస్డ్ విధానం ద్వారా ఈ పరీక్షను నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో చదువుతున్న ఏపీ విద్యార్థుల కోసం ఆ రాష్ట్రంలో 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల సౌలభ్యం కోసం తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్... 9, 10 తేదీల్లో మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్షలను నిర్వహించనున్నారు. బిట్ శాట్ రాస్తున్న 1,500 మందికి ఎంసెట్ పరీక్ష సమయాన్ని రీషెడ్యూల్ చేశారు.

  • Loading...

More Telugu News