kodada: తమ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని.. ఉప ఎన్నిక వస్తే 'దళిత బంధు' కింద తమకు కూడా 10 లక్షలు వస్తాయని దళితుల ఆందోళన
- కోదాడలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన
- ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాజీనామా చేయాలని డిమాండ్
- దళిత సంఘాల నేతల అరెస్టు
సూర్యాపేట జిల్లా కోదాడలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'దళిత బంధు' పథకాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఆయా కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఇస్తామని తెలిపింది.
దీంతో తమ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కూడా రాజీనామా చేయాలని, తమకు కూడా దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తారని చెబుతూ కోదాడలో దళిత సంఘాలు ధర్నా చేపట్టాయి. దీంతో దళిత సంఘాలకు బీజేపీ నేతలు మద్దతు ప్రకటించారు. ఆందోళనకు దిగిన దళిత సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్తత నెలకొంది.