TTD: జులైలో పెరిగిన భక్తుల తాకిడి.. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 55.55 కోట్లు

Tirumala Tirupati Devasthanam Hundi income in july over Rs 55 crore

  • తిరుమలకు మళ్లీ పెరిగిన భక్తుల తాకిడి
  • జులైలో శ్రీవారిని దర్శించుకున్న 5,32,780 భక్తులు
  • 2,55,283 మంది తలనీలాల సమర్పణ

శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి మళ్లీ మొదలైంది. కరోనా రెండో దశ విజృంభణ కారణంగా తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య గత కొన్ని నెలలుగా పడిపోయింది. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుండడం, ఆంక్షలు సడలించడంతో భక్తుల ప్రవాహం మళ్లీ మొదలైంది. ఫలితంగా గత నెలలో శ్రీవారి హుండీ ఆదాయం పెరిగింది.

గత నెలలో 5,32,780 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 2,55,283 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే, శ్రీవారికి గత నెలలో రూ. 55.55 కోట్ల హుండీ ఆదాయం లభించినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News