Junior NTR: శంకర్ పల్లి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ ఎన్టీఆర్ సందడి

NTR spotted at Shankar Pally Tahasildar Office
  • ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్
  • ఓ భూమి వ్యవహారంపై రెవెన్యూ కార్యాలయానికి రాక
  • అధికారులతో మాట్లాడిన వైనం
  • ఎన్టీఆర్ తో ఫొటోలకు పోటీలు పడిన ఉద్యోగులు
ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేశారు. ఎన్టీఆర్ రాకతో ఆ ప్రభుత్వ కార్యాలయంలో సందడి వాతావరణం కనిపించింది. ఎన్టీఆర్ తో ఫొటోలు దిగేందుకు ఉద్యోగులు సైతం పోటీ పడ్డారు. ఎన్టీఆర్ ఎవరినీ నిరాశపర్చకుండా అందరికీ ఓపిగ్గా ఫొటోలకు పోజులిచ్చారు.

ఇక, ఎన్టీఆర్ శంకర్ పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చింది ఓ భూమి రిజిస్ట్రేషన్ కోసమని తెలుస్తోంది. గోపాలపురం గ్రామ పరిధిలో ఆరున్నర ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారంపై ఎన్టీఆర్ రెవెన్యూ అధికారులతో మాట్లాడినట్టు సమాచారం.
Junior NTR
Shankar Pally
Tahasildar Office
Ranga Reddy District
RRR
Tollywood

More Telugu News