Peddyreddy: కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన పెద్దిరెడ్డి

Peddireddy joins TRS in presence of KCR

  • పెద్దిరెడ్డిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్
  • పెద్దిరెడ్డి తనకు ఎంతో సన్నిహితుడన్న కేసీఆర్
  • ఇద్దరం ఒకేసారి మంత్రులుగా పని చేశామని వ్యాఖ్య

మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. పెద్దిరెడ్డితో పాటు కాంగ్రెస్ నేత స్వర్గం రవి కూడా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి హరీశ్ రావు, గంగుల, కొప్పుల, ఎల్.రమణ, బాల్క సుమన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, పెద్దిరెడ్డి తనకు ఎంతో సన్నిహితుడని చెప్పారు. తాను, పెద్దిరెడ్డి ఇద్దరూ ఒకే సమయంలో మంత్రులుగా పనిచేశామని తెలిపారు. రైతుబంధు పథకం పక్కాగా అమలవుతోందని చెప్పారు. చేనేత కార్మికులకు రైతు బీమా తరహాలో సహాయం అందిస్తామని తెలిపారు. తెలంగాణను సాధించుకున్న తొలి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఉండేవని... వాటన్నింటినీ అధిగమించామని చెప్పారు.

Peddyreddy
KCR
TRS
  • Loading...

More Telugu News