Atchannaidu: దేవినేని ఉమాను అక్రమకేసుల్లో ఇరికించారు... వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం: అచ్చెన్నాయుడు
- కృష్ణా జిల్లాలో అక్రమ మైనింగ్ అంటూ టీడీపీ ఆరోపణలు
- ఉమాపై హత్యాయత్నం కేసు
- తీవ్రంగా స్పందించిన అచ్చెన్నాయుడు
- తుగ్లక్ పాలనలో అన్నీ రివర్సేనని విమర్శలు
మైనింగ్ అంశం నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాపై హత్యాయత్నం కేసు నమోదవడం పట్ల ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. తుగ్లక్ రెడ్డి పాలనలో అన్నీ రివర్స్ లో జరుగుతున్నాయని విమర్శించారు.
గత రెండేళ్లుగా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ జరుగుతోందని వార్తాపత్రికలతో పాటు దేవినేని ఉమా కూడా చెబుతున్నారని ఆయన అన్నారు. అక్రమ తవ్వకాల వద్ద దొరికిన జేసీబీలు, టిప్పర్లను జగన్ రెడ్డి అధికారులే స్వాధీనం చేసుకుని జరిమానా విధించారని చెప్పారు.
అయితే ఈ తుగ్లక్ రెడ్డి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను జైల్లో వేస్తే తనకు రావాల్సిన వాటా ఎక్కడ ఆగిపోతుందోనని, రివర్స్ లో దేవినేని ఉమాను అక్రమ కేసులో ఇరికించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తాము ఇవన్నీ గుర్తుంచుకుంటామని, అధికారంలోకి రాగానే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు.