Kadapa District: కడప జిల్లాలో వైసీపీ, బీజేపీ వర్గాల మధ్య కత్తులతో దాడి

YSRCP and BJP workers attacks with swords in Kadapa District

  • రాజుపాలెం మండలం అయ్యవారిపల్లెలో ఘర్షణ
  • ఆరుగురు బీజేపీ, ముగ్గురు వైసీపీ, ఒక వాలంటీర్ కు గాయాలు
  • తీవ్రంగా గాయపడ్డ బీజేపీ నేత కడప రిమ్స్ కు తరలింపు

వైసీపీ, బీజేపీ వర్గీయుల మధ్య జరిగిన దాడులతో కడప జిల్లా ఉలిక్కి పడింది. రాజుపాలెం మండలం అయ్యవారిపల్లెలో ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు కత్తులతో దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో బీజేపీకి చెందినవారు ఆరుగురు, వైసీపీకి చెందినవారు ముగ్గురు గాయపడ్డారు. బీజేపీకి చెందిన వారి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఈ ఘర్షణలో గ్రామ వాలంటీర్ వెంకటేశ్ కూడా గాయపడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే... ఇటీవలే అయ్యవారిపల్లిలో 100 కుటుంబాలు వైసీపీ నుంచి బీజేపీలోకి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ చెలరేగుతోంది. ఈ క్రమంలో బీజేపీ నాయకుడు ప్రసాద్, గ్రామ వాలంటీర్ వెంకటేశ్ మధ్య సంక్షేమ పథకం విషయంలో గొడవ జరిగింది. దీంతో, బీజేపీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు దాడి చేసినట్టు సమాచారం. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ప్రసాద్ ను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News