Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్​: రెండు సార్లు నిరాశపరిచి.. మూడోసారి సత్తా చాటిన మనూ భాకర్

Manu Bhaker Moves to Further as she gets 5th spot in 25m air pistol

  • 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో ఐదో స్థానం
  • తదుపరి రౌండ్ లోకి దూసుకెళ్లిన మనూ
  • 25వ స్థానంలో నిలిచిన ప్రపంచ రెండో ర్యాంకర్ రాహీ సార్నోబత్

టోక్యో ఒలింపిక్స్ లో షూటర్ మనూ భాకర్ సత్తా చాటింది. రెండు సార్లు నిరాశపరిచిన ఆమె.. మూడోసారి క్వాలిఫికేషన్ రౌండ్ లో అదరగొట్టింది. టాప్ 5లో చోటు దక్కించుకుని తదుపరి రౌండ్ కు వెళ్లింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆమె ట్రిగ్గర్ మొరాయించడంతో అవకాశం కోల్పోయిన మనూ భాకర్.. ఆ తర్వాత జరిగిన మిక్స్ డ్ డబుల్స్ ఈవెంట్ లోనూ ఆకట్టుకోలేకపోయింది.

అయితే, ఇవ్వాళ జరిగిన మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం పోటీల్లో ఆమె గెలిచి నిలిచింది. 44 మంది మహిళా షూటర్లు పాల్గొన్న ఈవెంట్ లో ఆమె 592 పాయింట్లు సాధించింది. పదికి పది పాయింట్లను 9 సార్లు సాధించింది. గురి చూసి ఇన్నర్ రింగ్ లో కాల్చింది.

 అయితే, ప్రపంచ నంబర్ 2 ర్యాంకర్ అయిన రాహీ సార్నోబత్ మాత్రం నిరాశపరిచింది. మూడు సిరీస్ ల క్వాలిఫికేషన్ రౌండ్ లో ఆమె 287 పాయింట్లు సాధించి 25వ స్థానంలో నిలిచింది. దీంతో ఆమె క్వాలిఫికేషన్ రౌండ్ నుంచి నిష్క్రమించింది. ఇక, ఈ ఇద్దరు రేపు జరిగే పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్ లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

  • Loading...

More Telugu News