Andhra Pradesh: ఐఏఎస్ బదిలీలలో స్వల్ప మార్పులు.. కొత్తగా మరో నలుగురిని బదిలీ చేసిన ఏపీ

AP govt got some changes in IAS transfers

  • స్వప్నిల్ దినకర్, సుమిత్ కుమార్ బదిలీలు నిలిపివేసిన ప్రభుత్వం
  • యథాతథ స్థానాల్లో కొనసాగింపు
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ ఆదిత్యనాథ్

ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఈ నెల 23న జారీ చేసిన ఉత్తర్వుల్లో ఏపీ ప్రభుత్వం నిన్న కొన్ని మార్పులు చేసింది. అలాగే, కొత్తగా మరో నలుగురిని బదిలీ చేస్తూ తాజాగా నిన్న మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఉన్న స్వప్నిల్ దినకరన్‌ను గతంలో చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా, రెవన్యూ)గా బదిలీ చేసింది. అలాగే, శ్రీకాకుళం సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా, రెవెన్యూ)గా ఉన్న సుమిత్ కుమార్‌ను పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా, రెవెన్యూ)గా బదిలీ చేయగా, తాజాగా వీరిద్దరినీ యథా స్థానాలలోనే కొనసాగిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.

సెర్ప్ సీఈవో పి.రాజబాబును చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా, రెవెన్యూ)గా, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇంతియాజ్‌ను సెర్ప్ సీఈవోగా, వెయిటింగ్‌లో ఉన్న గంధం చంద్రుడిని మైనారిటీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శిగా, చేనేత సహకార సంస్థ వీసీ అండ్ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా, రెవెన్యూ)గా బదిలీ చేసింది.

Andhra Pradesh
IAS
Transfers
  • Loading...

More Telugu News