Nagarjuna: 'బంగార్రాజు'లో నాగ్ సరసన శ్రియ?

Shriya in Nagarjuna movie

  • 'బంగార్రాజు'కు రంగం సిద్ధం
  • వచ్చేనెలలో షూటింగ్ మొదలు
  • చైతూ జోడీగా కృతి శెట్టి
  • తెరపైకి శ్రియ పేరు

నాగార్జున .. కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో గతంలో 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా తెరకెక్కింది. నాగార్జున కెరియర్లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఆ సినిమాలో నాగార్జున పోషించిన 'బంగార్రాజు' పాత్ర జనంలోకి బాగా వెళ్లింది. దాంతో ఆ పాత్ర పేరునే టైటిల్ గా చేసుకుని, కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే మరో సినిమా చేయనున్నట్టు నాగార్జున చెప్పారు.

అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. ఇంతకాలానికి ఇప్పుడు ఈ సినిమాకు ముహూర్తం కుదిరింది. ఆగస్టు రెండవ వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య జోడీగా కృతి శెట్టిని ఖాయం చేసినట్టుగా చెప్పుకుంటున్నారు.

ఇక నాగార్జున సరసన నాయికగా శ్రియను ఎంపిక చేసినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. నాగ్ సరసన రమ్యకృష్ణ చేయనుందనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఆమె స్థానంలో శ్రియను తీసుకున్నారా? లేదంటే ఇది వేరే పాత్రనా? అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది. గతంలో నాగ్ - శ్రియ కాంబినేషన్లో 'నేనున్నాను' .. 'సంతోషం' హిట్లు ఉన్నాయి.

Nagarjuna
Ramyakrishna
Shriya
Kruthi shetty
  • Loading...

More Telugu News