Road Accident: మ‌రో కారుపైకి దూసుకెళ్లిన క్వాలీస్ వాహనం.. ముగ్గురి మృతి

car accident in vikarabad

  • మ‌రొక‌రికి తీవ్ర‌గాయాలు
  • వికారాబాద్‌ జిల్లా పూడూరులో ఘ‌ట‌న‌
  • క్వాలీస్‌ వాహనం ఎక్సల్‌ రాడ్‌ విరిగిపోవడంతో ప్ర‌మాదం

ఓ కారు అదుపుత‌ప్పి ఎదురుగా వస్తున్న మరో కారుపైకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రొక‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. అత‌డిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. అయితే, అత‌డి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు చెప్పారు.

ఈ ప్ర‌మాదం వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ కాటన్‌ మిల్లు వద్ద చోటు చేసుకుంది. మృతులను మల్లికార్జున రెడ్డి, రాజ్యలక్ష్మి, దేవాన్ష్‌ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. కాట‌న్ మిల్లు వ‌ద్ద‌ క్వాలీస్‌ వాహనం ఎక్సల్‌ రాడ్‌ విరిగిపోవడంతో ఎదురుగా వస్తున్న కారుపైకి దూసుకెళ్లిందని పోలీసులు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




Road Accident
car
Vikarabad District
  • Loading...

More Telugu News