JP Nadda: సీఎంగా యడియూరప్ప సమర్థంగా పనిచేస్తున్నారు: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జేపీ నడ్డా

JP Nadda heaps praise on Karnataka CM Yediyurappa

  • కర్ణాటకలో దళిత సీఎం అంటూ వార్తలు
  • అనిశ్చితిలో సీఎం యడియూరప్ప 
  • స్పష్టత ఇచ్చిన జేపీ నడ్డా
  • యెడ్డి సర్కారుపై ఎలాంటి అసంతృప్తి లేదని వెల్లడి

కర్ణాటకలో దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తారంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే తాను సీఎం పదవిలో కొనసాగడంపై యడియూరప్ప అనిశ్చితితో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సాయంత్రంలోగా కర్ణాటక సీఎంపై బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని జాతీయ మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గోవా పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సీఎంగా యడియూరప్ప సమర్థంగానే పనిచేస్తున్నారని, ప్రభుత్వ పనితీరు పట్ల ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. ప్రతి అంశాన్ని యడియూరప్ప తనదైన శైలిలో పరిష్కరిస్తున్నారని కితాబునిచ్చారు. కర్ణాటక సర్కారులో నాయకత్వ సంక్షోభం ఉన్నట్టు మీడియాకు అనిపిస్తోందని, తమకు అలా కనిపించడంలేదని జేపీ నడ్డా పేర్కొన్నారు.

JP Nadda
Yediyurappa
CM
Karnataka
BJP
  • Loading...

More Telugu News