Raj Kundra: రాజ్‌ కుంద్రా, శిల్పా శెట్టి నివాసంలో పోలీసుల సోదాలు

Police raids in Raj Kundra and Shilpa Shetty home
  • పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్
  • తన అరెస్ట్ ను హైకోర్టులో సవాల్ చేసిన రాజ్
  • ఒరిజినల్ ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని కోర్టుకు తెలిపిన రాజ్
పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన విచారణ నిమిత్తం పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు వేగం పెంచారు. రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి నివాసాల్లో సోదాలు నిర్వహించారు.

మరోవైపు రాజ్ కుంద్రా రిమాండ్ పొడిగింపుకు సంబంధించి నిన్న కోర్టులో విచారణ జరిగింది. యాప్ లో అప్ లోడ్ చేసిన వీడియోలను పోర్న్ వీడియోలుగా చూడరాదని రాజ్ తరపు న్యాయవాది వాదించారు.

 మరోవైపు, తన అరెస్ట్ ను బాంబే హైకోర్టులో రాజ్ కుంద్రా సవాల్ చేశారు. ఒరిజినల్ ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని చెప్పారు. ఒరిజనల్ ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేదన్నారు. తన అరెస్టు తర్వాతే సీఆర్‌పీసీ41ఏ నోటీసుపై సంతకం చేయించుకున్నారని తెలిపారు. ఇది ముమ్మాటికీ చట్టాన్ని ఉల్లంఘించడమేనని చెప్పారు.
Raj Kundra
Shilpa Shetty
Police Raids
Bollywood

More Telugu News