Allu Arjun: 'గని' సెట్స్ లో హఠాత్తుగా మెరిసిన 'పుష్ప'

- షూటింగు దశలో 'గని'
- బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ
- ఒక నిర్మాతగా అల్లు బాబీ
- సరదాగా సెట్స్ కి వచ్చిన బన్నీ
వరుణ్ తేజ్ కథానాయకుడిగా 'గని' సినిమా రూపొందుతోంది. సిద్ధూ ముద్ద .. అల్లు బాబీ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చే క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

నిజానికి అల్లు అర్జున్ కూడా 'పుష్ప' షూటింగులో బిజీగానే ఉన్నాడు. అయితే కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న కారణంగా బ్రేక్ ఇచ్చారు. అందువలన తీరికగా ఉన్న అల్లు అర్జున్ సరదాగా 'గని' షూటింగుకు వచ్చాడన్న మాట. ఈ సినిమాతో సయీ మంజ్రేకర్ తెలుగు తెరకి కథానాయికగా పరిచయం కానుంది. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
