Driver App: అలిపిరి నుంచి తిరుమలకు బస్ డ్రైవింగ్ పేరిట యాప్... డిలీట్ చేయించిన అధికారులు

TTD officials takes action on a driver app

  • గూగుల్ ప్లే స్టోర్ లో డ్రైవర్ యాప్
  • హిందూ ధార్మిక సంఘాల ఆగ్రహం
  • టీటీడీ దృష్టికి తీసుకెళ్లిన వైనం
  • విచారణ చేపట్టిన టీటీడీ
  • పరారీలో యాప్ నిర్వాహకుడు సురేశ్

అలిపిరి నుంచి తిరుమలకు బస్ డ్రైవింగ్ పేరిట గూగుల్ ప్లే స్టోర్ లో నమోదైన ఓ డ్రైవర్ గేమ్ యాప్ ను అధికారులు డిలీట్ చేయించారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవాలంటే రూ.179 చెల్లించాలని, ఈ యాప్ లోని గేమ్ లో విజయం సాధిస్తే 20 శ్రీవారి లడ్డూలు గెలుచుకోవచ్చని యాప్ నిర్వాహకులు నెటిజన్లను ఊరించారు. ఈ గేమ్ లో తిరుపతి-తిరుమల బస్సులు కొండపైకి వెళ్లేటప్పుడు రోడ్డు పక్కన ఉండే కొండరాళ్లను ఢీకొన్నట్టు, చెట్లను ఢీకొన్నట్టు చూపించారు.

అయితే తిరుమల బస్సులు ఈ విధంగా ప్రమాదాలకు లోనైనట్టు చూపించడం హిందూ ధార్మిక సంఘాలను ఆగ్రహానికి గురిచేసింది. దాంతో వారు ఈ విషయాన్ని టీటీడీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన టీటీడీ అధికారులు విచారణ చేపట్టగా, యాప్ ఆర్గనైజర్ సురేశ్ పరారయ్యాడు. ఈ నేపథ్యంలో, టీటీడీ అధికారులు గూగుల్ ప్లే స్టోర్ సిబ్బందికి విషయం వివరించి, యాప్ ను తొలగించేలా చర్యలు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News