Telangana: తెలంగాణలో బ్లాక్ ఫంగస్‌తో మరణించింది నలుగురే: కేంద్రం
- బ్లాక్ ఫంగస్‌తో దేశవ్యాప్తంగా 4,332 మంది మృతి
- కరోనాతో మరణించిన వైద్యులకు రూ. 50 లక్షల పీఎంజీకేపీ బీమా చెల్లింపు
- తెలంగాణలో 48,775 మంది కేన్సర్ బాధితులు
తెలంగాణలో బ్లాక్ ఫంగస్‌తో చనిపోయింది నలుగురు మాత్రమేనని కేంద్రం వెల్లడించింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ పవార్ రాజ్యసభలో నిన్న బ్లాక్ ఫంగస్‌పై ఓ సభ్యుడు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. బ్లాక్ ఫంగస్‌తో దేశవ్యాప్తంగా 4,332 మంది మరణించారని తెలిపారు. తెలంగాణలో 2,538 మంది ఈ ఫంగస్ బారినపడగా నలుగురు మాత్రమే చనిపోయినట్టు వివరించారు.
ఇక కరోనాతో మరణించిన వైద్య సిబ్బందికి పీఎంజీకేపీ బీమా కింద ఒక్కొక్కరికి రూ. 50 లక్షల బీమా చెల్లించినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి తెలంగాణ నుంచి 64 క్లెయిములు వచ్చాయని, వాటిలో 53 పరిష్కరించామన్నారు. అలాగే, తెలంగాణలో 2019 నాటికి 46,464 మంది కేన్సర్ బాధితులు ఉన్నట్టు చెప్పిన మంత్రి.. ఆ సంఖ్య ప్రస్తుతం 48,775గా ఉందని వివరించారు.