Sri Lanka: శ్రీలంకతో రెండో వన్డేలో టీమిండియా టార్గెట్ 276 రన్స్
- మొదట బ్యాటింగ్ చేసిన లంక
- 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 రన్స్
- ఆవిష్క, అసలంక అర్ధసెంచరీలు
- ఆఖర్లో బ్యాట్ ఝుళిపించిన కరుణరత్నే
- చహల్, భువీకి చెరో 3 వికెట్లు
భారత్ తో రెండో వన్డేలో శ్రీలంక భారీ స్కోరు సాధించింది. కొలంబోలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లంక మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో (50), చరిత్ అసలంక (65) అర్ధసెంచరీలతో రాణించారు. చివర్లో చమీర కరుణరత్నే 33 బంతుల్లోనే 44 పరుగులు సాధించడంతో లంక భారీ స్కోరు నమోదు చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో యజువేంద్ర చహల్ 3, భువనేశ్వర్ కుమార్ 3, దీపక్ చహర్ 2 వికెట్లు తీశారు.
లంక జట్టు బ్యాటింగ్ 45 ఓవర్ల వరకు నిదానంగానే సాగింది. చివరి 5 ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయినా, 46 పరుగులు రాబట్టింది.