Taja Sajja: థియేటర్లకే తేజ సజ్జ 'ఇష్క్'.. రిలీజ్ డేట్ ఖరారు!

- మరో ప్రేమకథగా తేజ సజ్జ 'ఇష్క్'
- కథానాయికగా ప్రియా ప్రకాశ్
- నూతన దర్శకుడి పరిచయం
- ఈ నెల 30వ తేదీన విడుదల
యువ కథానాయకులలో తేజ సజ్జ తన జోరు పెంచుతున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'జాంబిరెడ్డి' విజయాన్ని సాధించడంతో, ఆ తరువాత నుంచి తేజ మరింత బిజీ అయ్యాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే 'హనుమాన్' అనే మరో సినిమా చేస్తున్నాడు. ఇక కొంతకాలం క్రితమే ఆయన 'ఇష్క్.. నాట్ ఏ లవ్ స్టోరీ' సినిమా చేశాడు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఒకానొక సమయంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి వెళ్లనుందనే టాక్ కూడా వినిపించింది.
