New Delhi: ఢిల్లీలో ఘటన... నడిరోడ్డుపై భారీ గుంతలోకి జారిపోయిన కారు

Huge sink hole on Delhi road swallowed a big car
  • ఢిల్లీలో భారీ వర్షాలు
  • ద్వారకా ప్రాంతంలో కుంగిన రోడ్డు
  • ఒక్కసారిగా పడిపోయిన కారు
  • క్రేన్ తో కారును వెలికి తీసిన అధికారులు
ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రికార్డు స్థాయి వర్షాలతో దేశరాజధాని అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో, ఒళ్లు గగుర్పొడిచే సంఘటన జరిగింది. ద్వారకా ప్రాంతంలోని సెక్టార్-18లో ఓ రోడ్డుపై భారీ గుంత ఏర్పడి ఓ కారు అందులోకి జారిపోయింది. భారీ వర్షాలకు రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడంతో ఆ గుంత ఏర్పడినట్టు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనలో కారు కూరుకుపోవడం మినహా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఓ భారీ క్రేన్ సాయంతో కారును గుంతలోంచి వెలికితీశారు.

కాగా, ఈ ఘటన వీడియోను పంచుకున్న ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వ్యంగ్యం ప్రదర్శించారు. ఢిల్లీ సీఎంకు మాటలు ఎక్కువ, పని తక్కువ అని విమర్శించారు. రోడ్ల నిర్వహణ సరిగా లేదంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
New Delhi
Sink Hole
Car
Dwaraka

More Telugu News