Revanth Reddy: తెలంగాణను కేసీఆర్ దివాళా తీయిస్తున్నారు: రేవంత్ రెడ్డి

KCR is bankrupting Telangana says Revanth Reddy
  • బంగారం కంటే విలువైన భూములను అమ్ముతున్నారు
  • బంధువులు, బినామీలకు కట్టబెడుతున్నారు
  • శ్రీచైతన్య కంపెనీ, ప్రిస్టేజ్ ఎస్టేట్ కూడా 15 ఎకరాల భూమిని కొనుగోలు చేశాయి
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత రాష్ట్ర వారసత్వ సంపదను కేసీఆర్ అందినకాడికి అమ్ముతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవత్ రెడ్డి మండిపడ్డారు. బంగారం కంటే విలువైన భూములను అమ్ముతూ, రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని విమర్శించారు. కోకాపేట, నార్సంగిలో పేదలకు కేటాయించిన భూములను అమ్ముతున్నారని అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాజెక్టుల కోసం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తే... అప్పుడు కేసీఆర్ అడ్డుపడ్డారని రేవంత్ చెప్పారు. భూములు అమ్మడానికి అప్పటి సీమాంధ్ర ముఖ్యమంత్రులు భయపడ్డారని అన్నారు. ఆనాడు అమ్మకుండా మిగిలిపోయిన విలువైన భూములను ఇప్పుడు కేసీఆర్ తన బంధువులు, బినామీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.

శ్రీచైతన్య కంపెనీ, ప్రిస్టేజ్ ఎస్టేట్ కూడా 15 ఎకరాల భూమిని కొనుగోలు చేశాయని రేవంత్ చెప్పారు. భూముల అమ్మకాల్లో రూ. వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలకు వివరణ ఇస్తారని తాము ఆశించామని... కానీ కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని విమర్శించారు.
Revanth Reddy
Congress
KCR
TRS
Land Sale
Telangana

More Telugu News