TTDP: టీటీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును నియమించిన చంద్రబాబు
- 1994-99 మధ్య ఎమ్మెల్యేగా చేసిన బక్కని నర్సింహులు
- ఎల్. రమణ టీఆర్ఎస్ లో చేరడంతో ఖాళీ అయిన అధ్యక్ష పదవి
- ఆసక్తి చూపని రావుల చంద్రశేఖర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. ఇంతకాలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రమణ స్థానంలో నర్సింహులును చంద్రబాబు నియమించారు.
బక్కని నర్సింహులు మాదిగ సామాజికవర్గానికి చెందినవారు. 1994-99 మధ్య కాలంలో షాద్ నగర్ ఎమ్మెల్యేగా బాధ్యతలను నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకానికి సంబంధించిన చర్చ సందర్భంగా ఒకానొక సమమయంలో సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడానికి ఆయన ఆసక్తి చూపలేదు. దీంతో బక్కని నర్సింహులుకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు.
మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను బక్కని నర్సింహులు మద్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బక్కనిని లోకేశ్ అభినందించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాల నిలబడి పోరాటం చేయాలని అన్నారు.