Raviteja: 'రామారావు' కోసం రంగంలోకి దిగిన హీరోయిన్లు!
![New heroines in Rama Rao movie](https://imgd.ap7am.com/thumbnail/cr-20210719tn60f510f7c9caf.jpg)
- కొత్త డైరెక్టర్ తో రవితేజ
- దివ్యాన్ష కౌశిక్ రెండో సినిమా
- రజీషా విజయన్ పరిచయం
- సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్
రవితేజ కథానాయకుడిగా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా రూపొందుతోంది. శరత్ మండవ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. రవితేజ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టు పోస్టర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అవినీతిపరుల ఆటకట్టించే 'సబ్ కలెక్టర్' గా రవితేజ ఇందులో కనిపించనున్నాడు. ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ .. రజీషా విజయన్ కథానాయికలుగా అలరించనున్నారు. తాజాగా వాళ్లు ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, ఈ సినిమా టీమ్ పోస్టర్స్ ను వదిలింది.
![](https://img.ap7am.com/froala-uploads/20210719fr60f510f1f0d23.jpg)