Akhil: 'అందాల రాక్షసి' దర్శకుడితో అఖిల్?

Akhil in Hanu Raghavapudi movie

  • రిలీజ్ కోసం 'బ్యాచ్ లర్' వెయిటింగ్
  • షూటింగు దశలో 'ఏజెంట్'
  • స్పీడ్ పెంచే ఆలోచన
  • లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్

అఖిల్ ఓ అందమైన ప్రేమకథను చేయడానికి అంగీకరించినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమాకి, హను రాఘవపూడి దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు సమాచారం. ఇటీవలే అఖిల్ ను కలిసిన హను రాఘవపూడి ఒక లవ్ స్టోరీని ఆయనకి చెప్పాడట. కథ నచ్చడంతో అఖిల్ ఓకే చెప్పేశాడని అంటున్నారు. 'అందాల రాక్షసి' సినిమాతో దర్శకుడిగా తన సత్తాను చాటుకున్న హను రాఘవపూడి, ఆ తరువాత కూడా ప్రేమకథలనే చేసుకుంటూ వెళుతున్నాడు.

ఇక అఖిల్ విషయానికొస్తే ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా సిద్ధంగా ఉంది. ఆ తరువాత సినిమాగా ఆయన 'ఏజెంట్' చేస్తున్నాడు. రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమాకి, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అఖిల్ తన కథలు .. ప్రాజెక్టుల ఎంపికలో ఆలస్యం చేస్తున్నాడనే టాక్ ఉంది. అందువలన ఇకపై తన సినిమాల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండకూడదని ఆయన భావిస్తున్నాడట. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన హను రాఘవపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.

మరోపక్క, హను రాఘవపూడి గత కొన్నాళ్లుగా దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇంకా ఈ సినిమాకు టైటిల్ ను సెట్ చేయలేదు. యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఆయన ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. స్వప్న సినిమా బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సోల్జర్ పాత్రలో కనిపించనున్నాడు. మృణాళ్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Akhil
Hanu Raghvapudi
  • Loading...

More Telugu News