Surya: సూర్య బర్త్ డే స్పెషల్ గా రానున్న ఫస్టులుక్!

- ఈ నెల 23వ తేదీన సూర్య బర్త్ డే
- సెట్స్ పై సూర్య 40వ సినిమా
- దర్శకుడిగా పాండిరాజ్
- వెట్రిమారన్ తో మరో ప్రాజెక్టు
- 'వాడి వాసల్ ' టైటిల్ ఖరారు
సూర్య కథానాయకుడిగా పాండిరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. కెరియర్ పరంగా సూర్యకి ఇది 40వ సినిమా. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. అయితే ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్ ను ఎనౌన్స్ చేయలేదు .. ఫస్టులుక్ ను వదల్లేదు. దర్శకుడిగా పాండిరాజ్ కి మంచి ఇమేజ్ ఉంది .. ఇక హీరోగా సూర్యకి గల క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందువలన సహజంగానే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. ఈ నెల 23వ తేదీన సూర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో కూడిన ఫస్టులుక్ పోస్టర్ ను వదలనున్నారట.
