GRMB: కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ లు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాలను కోరిన గోదావరి బోర్డు
- నదీ యాజమాన్యాల బోర్డుల పరిధిపై స్పష్టత
- రంగంలోకి దిగిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు
- ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖలు
- డీపీఆర్ లపై వెంటనే స్పందించాలని వెల్లడి
కేంద్రం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని సవివరంగా నిర్వచించిన నేపథ్యంలో, గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ లు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరింది. త్వరగా డీపీఆర్ లు సమర్పించాలని జీఆర్ఎంబీ స్పష్టం చేసింది.
ఈ మేరకు తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శికి, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శికి గోదావరి బోర్డు లేఖలు రాసింది. అపెక్స్ కౌన్సిల్, బోర్డు నిర్ణయాల మేరకు డీపీఆర్ లు ఇవ్వాలని సూచించింది. డీపీఆర్ లు ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని గుర్తు చేసింది. బోర్డు, సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు లోబడి డీపీఆర్ లు ఉండాలని జీఆర్ఎంబీ స్పష్టం చేసింది.