Rajamouli: రాజమౌళి క్లాప్ తో ప్రారంభమైన 'ఛత్రపతి' హిందీ రీమేక్!
![Chatrapathi hindi remake launched by Rajamouli](https://imgd.ap7am.com/thumbnail/cr-20210716tn60f1274bf00cb.jpg)
- తెలుగులో హిట్ కొట్టిన 'ఛత్రపతి'
- బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీ రీమేక్
- వీవీ వినాయక్ దర్శకత్వం
- రెగ్యులర్ షూటింగుకి సన్నాహాలు
బెల్లంకొండ శ్రీనివాస్ - వీవీ వినాయక్ కాంబినేషన్లో 'ఛత్రపతి' హిందీ రీమేక్ రూపొందుతోంది. కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. 'పెన్' స్టూడియోస్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కొంతసేపటి క్రితం హైదరాబాదులో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. బెల్లంకొండ శ్రీనివాస్ పై రాజమౌళి క్లాప్ ఇవ్వడంతో ఈ సినిమా షూటింగు లాంఛనంగా ప్రారంభమైంది. తొలి షాట్ కి ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం గౌరవ దర్శకత్వం వహించారు.
![](https://img.ap7am.com/froala-uploads/20210716fr60f12723ef644.jpg)