Adhith: పూజ హెగ్డే చేతులమీదుగా 'డియర్ మేఘ' సాంగ్ రిలీజ్!

- మేఘ ఆకాశ్ చుట్టూ తిరిగే కథ
- అందంగా అల్లుకున్న ప్రేమకథ
- సంగీత దర్శకుడిగా గౌర హరి
- దర్శకుడిగా సుశాంత్ రెడ్డి పరిచయం
'డియర్ మేఘ' టైటిల్ తో మరో అందమైన ప్రేమకథా చిత్రం ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. అదిత్ అరుణ్ .. మేఘ ఆకాశ్ జంటగా నటించిన ఈ సినిమాకి సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అర్జున్ దాస్యం నిర్మించిన ఈ సినిమాకి, గౌర హరి సంగీతాన్ని అందించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ లిరికల్ వీడియో వచ్చింది. పూజ హెగ్డే చేతుల మీదుగా ఈ సాంగ్ ను రిలీజ్ చేయించారు.
